ఏపీలో పదవీ విరమణ వెంటనే కీలక పోస్టింగ్.. లక్ అంటే సీనియర్ IAS విజయానంద్‌దే

Date:

ఏపీలో సీనియర్ ఐఏఎలస్‌లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన వెంటనే కె విజయానంద్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను సీఎంవోలోకి స్పెషల్ సీఎస్‌గా తీసుకున్నారు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు సీఎం స్పెషల్ సీఎస్‌గా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా విజయానంద్ పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. శనివారం రోజు ఆయన రిటైర్ అయ్యారు.. కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. అయితే విజయానంద్ పదవీవిరమణ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు కీలకమైన పోస్టింగ్ ఇచ్చారు. విజయానంద్‌ను ముఖ్యమంత్రికి ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. అలా పదవీ విరమణ చేశారో లేదో.. ఇలా ఆయన పునర్నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చేశాయి.

విజయానంద్ ఏపీ ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీట్రాన్స్‌కో సీఎండీ పోస్టుల్లోను కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయన ఏడాది లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పోస్టులో కొనసాగుతారని ప్రభుత్వం క్లియర్‌గా చెప్పింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఈవోగా బదిలీ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి టీటీడీ ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌సింఘాల్‌ను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు అప్పగించారు.. ఇప్పుడు సీఎంవోలో రవిచంద్ర స్థానంలో విజయానంద్‌కు పోస్ట్ ఇవ్వడంతో.. రవిచింద్రను టీటీడీకి పూర్తిస్థాయిలో ఈవోగా బదిలీ చేసింది ప్రభుత్వం.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...