
పీ మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌లో ర్యాంకులు.. టాప్‌లో అచ్చెన్నాయుడు
ఏపీ మంత్రుల ఈ-ఫైళ్ల క్లియరెన్స్ వేగంపై ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. రెండో రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఈ వివరాలను వెల్లడించారు. మంత్రులతో పాటు అధికారులు కూడా ఫైళ్లను వీలైనంత త్వరగా, సాధ్యమైనంత వరకు అదే రోజు క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
జూన్ 9 నుంచి సెప్టెంబర్ 9 వరకు మంత్రులు క్లియర్ చేసిన ఫైళ్ల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 675 ఫైళ్లను ఆయన క్లియర్ చేయగా.. ఒక్కో ఫైల్‌కు సగటున గంటా 51 నిమిషాలు సమయం తీసుకున్నారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సామర్థ్యానికి ప్రాధాన్యమిస్తున్నారని సీఎం ప్రశంసించారు.
మంత్రుల ర్యాంకులు
- అచ్చెన్నాయుడు – 675 ఫైళ్లు, ఒక్కో ఫైల్‌కు 1 గంట 51 నిమిషాలు
- నిమ్మల రామానాయుడు – 410 ఫైళ్లు, 6 గంటల 30 నిమిషాలు
- బీసీ జనార్దన్ రెడ్డి – 148 ఫైళ్లు, 6 గంటల 52 నిమిషాలు
- ఎన్ఎండీ ఫరూక్ – 275 ఫైళ్లు, 15 గంటల 1 నిమిషం
- టీజీ భరత్ – 238 ఫైళ్లు, 19 గంటల 51 నిమిషాలు
- పొంగూరు నారాయణ – 643 ఫైళ్లు, 20 గంటల 39 నిమిషాలు
- కొలుసు పార్థసారథి – 80 ఫైళ్లు, 1 రోజు 47 నిమిషాలు
- డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి – 131 ఫైళ్లు, 1 రోజు 3 గంటల 32 నిమిషాలు
- నారా లోకేష్ – 1,166 ఫైళ్లు, 1 రోజు 7 గంటల 43 నిమిషాలు
- అనగాని సత్యప్రసాద్ – 773 ఫైళ్లు, 1 రోజు 9 గంటల 8 నిమిషాలు
ఫైళ్ల క్లియరెన్స్‌లో ఎక్కువ సమయం తీసుకుంటున్న మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, పయ్యావుల కేశవ్ అని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అధికారులు, మంత్రులు ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
