‘మాస్ మహారాజా’ రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటున్న ఈ సినిమా నాలుగో వారంలోకి అడుగుపెట్టినా థియేటర్లలో ఆక్యుపెన్సీ నిలకడగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే థియేట్రికల్ రన్‌లో 25 రోజులు పూర్తి చేసుకున్న ‘ఇరుముడి’.. ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్ల గ్రాస్ మార్క్‌కు చేరువైనట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ షోలపై ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జోరు ఇలాగే కొనసాగితే సినిమా రూ.250 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకునే అవకాశం ఉంది.

ఓటీటీ రిలీజ్‌తో మారనున్న పరిస్థితులు?

మరోవైపు ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ కూడా వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్లో సెప్టెంబర్ 18 నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీంతో థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకున్నట్లేనని తెలుస్తోంది.

సాధారణంగా ఓటీటీ రిలీజ్ తర్వాత థియేటర్లలో సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ‘ఇరుముడి’ రూ.250 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక వచ్చే వారం నాని నటించిన ‘ది ప్యారడైజ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు ‘ఇరుముడి’కి థియేటర్లలో మంచి రన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ 18 నుంచే ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో బాక్సాఫీస్ వసూళ్లపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.

ప్రస్తుతం రూ.240 కోట్ల మార్క్‌కు చేరువలో ఉన్న ‘ఇరుముడి’.. రూ.250 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందా? సినిమా ఫైనల్ రన్ ముగిసే సమయానికి ఎంత వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *