
D news: టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్‌ను తొలుత సొంతం చేసుకోవాలనే ఉత్సాహంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు యాపిల్ స్టోర్ల ముందు బారులు తీరారు.
పలు దేశాల్లో అర్ధరాత్రి నుంచే స్టోర్ల వద్దకు చేరుకున్న అభిమానులు విక్రయాలు ప్రారంభమయ్యే వరకు వేచి చూశారు. భారత్‌లోనూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద సందడి నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి విక్రయాలు ప్రారంభం కావడంతో తొలి యూనిట్లను దక్కించుకునేందుకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు.
కొత్త ఐఫోన్ కోసం అభిమానులు చూపించిన ఉత్సాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
