ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఉరవకొండ తహసీల్దార్ పి.జి. అరుణ తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌ ఆన్‌లైన్‌ ద్వారా సివిల్‌ సప్లయిస్‌కు సంబంధించి ఒకటి, డెత్‌ అండ్‌ బర్త్‌ సర్టిఫికెట్లకు రెండు, ఆర్‌వోఆర్‌కు ఐదు, ఇంటి స్థలాలకు సంబంధించి రెండు అర్జీలు అందాయని తెలిపారు. వీటిలో నాలుగు పరిష్కరించగా, భూములకు సంబంధించిన ఆరు అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్ల కోసం 49 అర్జీలు రాగా.. 35 పరిష్కరించి, 11 తిరస్కరించినట్లు తెలిపారు. మరో మూడు అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇన్‌కమ్‌, క్యాస్ట్‌ సర్టిఫికెట్లకు సంబంధించి ఆరు అర్జీలు రాగా.. నాలుగు పరిష్కరించి, ఒకటి తిరస్కరించగా, మరో అర్జీ పెండింగ్‌లో ఉందన్నారు.

చిన్న, సన్నకారు రైతుల సర్టిఫికెట్లకు 9 అర్జీలు రాగా.. 5 పరిష్కరించి, 4 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఎల్‌ఆర్‌బీడీకి సంబంధించి 45 అర్జీలు రాగా.. 11 పరిష్కరించగా, 34 పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఆధార్‌ సీడింగ్‌కు వచ్చిన నాలుగు అర్జీలను పూర్తిగా పరిష్కరించినట్లు తెలిపారు.

ఇక ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ల కోసం వచ్చిన 168 అర్జీలు, ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లకు సంబంధించిన 49 అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తహసీల్దార్ అరుణ వెల్లడించారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *