కాలుష్యం, దుమ్ము, సరైన సంరక్షన లేకపోవడం వల్ల తలలో దురద, పొలుసులు, చుండ్రుతో వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపతున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు. కానీ కొన్ని సహజ చిట్కాలతో ఈజీగా ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలానో ఇక్కడ చూద్దాం.

తలపై చుండ్రు పెరిగిపోవడాన్ని తగ్గించాలంటే మొదట మనం వాటికి గల పూర్తి కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్య సహజంగా మాడుపై ఉండే ఒక సూక్ష్మజీ కారణంగా వస్తుంది. ఇది సెబేషియస్ గ్రంథులు ఉత్పత్తి చేసే సెబంను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియ వల్ల మాడుపై మంట, దురద ఏర్పడతాయి. దీని ఫలితంగా చర్మ కణాలు వేగంగా రాలి పొలుసులుగా మారతాయి. అంతేకాదు హార్మోన్లలో మార్పులు కూడా ఈ సెబం ఉత్పత్తిని పెంచుతాయి. అధిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వంటి అలావాట్లు కూడా చుండ్రు సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు అంటున్నారు.

అలాగే మనం రోజూ తినే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్ వంటివి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయని.. దీనికి ప్రతిస్పందనగా, ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయి సెబేషియస్ గ్రంథులను ప్రేరేపించి, సెబం ఉత్పత్తిని పెంచుతుందని చెబుతున్నారు. ఇది మెలసేజియా గ్లోబోజా వృద్ధికి దోహదపడుతుందని.. దీని వల్ల కొన్ని సందర్భాలలో, చుండ్రు సోరియాసిస్ వంటి ఇతర చర్మ వ్యాధుల లక్షణం కూడా కావచ్చని చెబుతున్నారు.

ఈ సమస్యను తగ్గించే సహజ చిట్కాలు ఇవే

కుంకుడుకాయ తలస్నానం: ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే ఖరీదైన షాంపూలకు బదులు సహజమైన కుంకుడుకాయలతో తల స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కుంకుడుకాయలను రాత్రంతా నానబెట్టి, ఉదయం వాటిని పిసికి వచ్చిన రసంతో మాత్రమే తలస్నానం చేయాలి.

వేప నూనె: వేప నూనెలో యాంటీ-ఫంగల్, యాంటీ-బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి జుట్టులోని చుండ్రును, ఫంగస్‌ను తొలగించడంతో చాలా బాగా పనిచేస్తాయి, ఇందుకోసం తలస్నానం చేయడానికి రెండు నుండి మూడు గంటల ముందు మాడుకు బాగా పట్టించి, ఆపై కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఈజీగా సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఉమ్మెత్త ఆకుల రసం: ఇది చుండ్రుకు అత్యంత శక్తివంతమైన నివారణలలో ఒకటి. ఇందుకోసం ఉమ్మెత్త ఆకులను శుభ్రం చేసి, వాటిని దంచి రసం తీయాలి. ఈ రసాన్ని కొబ్బరి నూనె లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో కలిపి మాడుకు అప్లై చేయాలి. అయితే ఇది కలిపేడప్పుడు 50 ml ఉమ్తె్త రసం తీసుకుంటే ,25 ml కొబ్బరి నూనె వాడాలి, దీన్ని మాడుకు, వెంట్రుకలకు బాగా పట్టించి, మూడు నాలుగు గంటలు అలాగే ఉంచి, ఆపై కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా మూడు వారాలు ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య గణనీయంగా తగ్గుతుంది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *