రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఉంటాయి…

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు APPSC శుభవార్త అందించింది. ఏపీ ఫారెస్ట్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (FSO) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబరు 16 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. హార్టికల్చర్, జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ వంటి విభాగాల్లో విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 5, 2026వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల ఎంపిక పలు దశల్లో జరుగుతుంది. రాత పరీక్ష – ఆబ్జెక్టివ్ టైప్, క్వాలిఫైయింగ్ టెస్ట్, వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించి విద్యార్హత, వయోపరిమితి, శారీరక ప్రమాణాలు, పరీక్ష విధానం, ఫీజు, సిలబస్ తదితర వివరాలను నిర్ధారించుకోవాలి. దరఖాస్తులో తప్పులు లేకుండా అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *