
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి, పలువురికి కొత్త బాధ్యతలు అప్పగించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి కూడా పోస్టింగులు లభించాయి.
పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కాంతి రాణా టాటాను ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ ఐజీగా నియమించారు. విశాల్ గున్నిని ట్రైనింగ్ డీఐజీగా నియమించడంతో పాటు ఏపీ పోలీస్ అకాడమీ (APPA) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఎస్పీఎఫ్ డీజీగా ఉన్న సీహెచ్ త్రివిక్రమ్ వర్మను ఎఫ్ఎస్ఎల్ ఐజీ, డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఏసీబీ డైరెక్టర్ ఆర్.జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా నియమించారు. ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారిని రైల్వేస్ ఐజీగా బదిలీ చేసి, సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ డీఐజీ బాబూజీ అట్టాడను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా నియమించి, గ్రేహౌండ్స్ డీఐజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
ఇదే సమయంలో మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. పోలవరం ఓఎస్డీగా ఉన్న పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం జిల్లా ఎస్పీగా నియమించారు. సీఎంఎస్జీ ఎస్పీగా ఉన్న జగదీశ్ అదహళ్లిని పల్నాడు ఎస్పీగా బదిలీ చేశారు. సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని పోలవరం జిల్లా ఎస్పీగా నియమించారు.
మార్కాపురం, పోలవరం జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు లేకపోవడంతో ఇప్పటివరకు ఇతర జిల్లాల ఎస్పీలు ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వహించారు. పల్నాడు ఎస్పీగా పనిచేసిన బి.కృష్ణారావు కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో ఆ పోస్టు కూడా ఖాళీగా ఉంది. తాజా బదిలీలతో ఈ మూడు జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం పూర్తయింది.
మొత్తంగా తాజా బదిలీల్లో కీలక విభాగాలకు కొత్త అధికారులను నియమించడంతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను ప్రభుత్వం నియమించింది.
