ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ ఆసక్తికరమైన ఘటనను గుర్తుచేసుకున్నారు. సిక్కింలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తన టీమ్ చైనా సైన్యానికి చిక్కుకుందని ఆయన తెలిపారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో తన కెరీర్ ఇక ముగిసిపోయిందని భావించినట్లు దోవల్ చెప్పారు. అయితే విచారణలో మ్యాప్‌లో ఉన్న పొరపాటు కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తేలిందని వెల్లడించారు.

ఆ సమయంలో ఓ టిబెటన్ షెర్పా చెప్పిన మాటలు తనపై ఎంతో ప్రభావం చూపాయని, అవి ఇప్పటికీ తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయని దోవల్ పేర్కొన్నారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ కీలక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. సిక్కింలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో తన ఏజెంట్లు చైనా సైన్యానికి పట్టుబడ్డారని తెలిపారు. ఈ ఘటనతో తన కెరీర్ ఇక ముగిసిపోయినట్టేనని ఆ సమయంలో భావించినట్లు దోవల్ వెల్లడించారు. అయితే, అనంతరం జరిగిన విచారణలో ఈ ఘటనకు తన తప్పిదం కారణం కాదని తేలిందని ఆయన పేర్కొన్నారు.

ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. తన కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ కీలక ఘటనను విద్యార్థులతో పంచుకున్నారు. అప్పట్లో సిక్కింలో ఇంటెలిజెన్స్ బాధ్యతలు తనకు అప్పగించారని, చైనా సరిహద్దు ప్రాంతాల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కదలికలపై నిఘా పెట్టడం, సమాచారాన్ని సేకరించడం తన విధుల్లో భాగమని తెలిపారు.

ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతంలో నిఘా సమాచారం సేకరించేందుకు తన బృందాన్ని పంపినట్లు దోవల్ చెప్పారు. ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సిన టీమ్.. 15 రోజులు గడిచినా వెనుదిరగకపోవడంతో ఆందోళనకు గురైనట్లు వెల్లడించారు. ఆ సమయంలో హెడ్‌క్వార్టర్స్ నుంచి వచ్చిన ఫోన్‌తో అసలు విషయం తెలిసిందని, తన బృందాన్ని చైనా సైన్యం అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు.

ఈ ఘటనపై విచారణ ప్రారంభం కావడంతో తన కెరీర్ ముగిసిపోయినట్లేనని భావించినట్లు దోవల్ గుర్తుచేసుకున్నారు. అయితే, విచారణలో తనను తప్పుబట్టలేదని చెప్పారు. బృందానికి హెడ్‌క్వార్టర్స్ నుంచి అందించిన మ్యాప్‌లు, స్కెచ్‌లలో ఉన్న పొరపాట్లే ఈ ఘటనకు కారణమని విచారణలో తేలిందన్నారు. తాను చేయాల్సిన విధులను సక్రమంగానే నిర్వర్తించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని దోవల్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *