
అమలాపురం: కోనసీమ జిల్లాలో మత్స్యకారుల బోటు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయింది. భైరవపాలెం గ్రామానికి చెందిన చింత శ్రీను బోటుపై తొమ్మిది మంది మత్స్యకారులు వేటకు వెళ్లారు.
తెల్లవారుజామున భైరవపాలెం మొగ సమీపంలో సముద్రంలో గాలుల తీవ్రత పెరగడంతో బోటు అదుపుతప్పి మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు.
అదే సమయంలో సమీపంలో ఉన్న మరో బోటు సిబ్బంది వెంటనే స్పందించి.. మునిగిపోతున్న బోటులోని తొమ్మిది మంది మత్స్యకారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
గాలుల తీవ్రత కారణంగానే బోటు ప్రమాదానికి గురైనట్లు మత్స్యకారులు తెలిపారు.
