నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా ఇదంతా గాడ్స్ ప్లాన్ సంజూ శాంసన్ ఎమోషనల్

Date:

2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఫైనల్లో 46 బంతుల్లో 89 పరుగులు చేసిన శాంసన్, నాకౌట్ మ్యాచ్‌ల్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒకప్పుడు బెంచ్‌పైనే కూర్చోవాల్సి వచ్చిన తన ప్రయాణం ఇప్పుడు కల నిజమైనట్టు అనిపిస్తోందని భావోద్వేగంగా తెలిపాడు.

ఫైనల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా వరుసగా రెండోసారి టైటిల్‌ను కాపాడుకుంది. వరుసగా రెండుసార్లు టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే, దక్కించుకున్నాక సంజూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా రికార్డు స్థాయిలో 255/5 స్కోర్ చేసింది. ఇది టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో నమోదైన అత్యధిక స్కోర్. అనంతరం బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్‌ను కేవలం 159 పరుగులకే ఆలౌట్ చేసి భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా, సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...