పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. పరుగులు పెట్టిన అధికారులు

Date:

మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు.

మైలవరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తారక రామానగర్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో వడ్డిస్తున్న భోజనంపై విద్యార్థులను మంత్రి లోకేశ్ ఆరా తీశారు. ‘భోజనం రోజూ బాగోవడం లేదా? ఆ ఒక్క రోజే బాగోలేదా?’ అంటూ విద్యార్థులను ఈ సందర్భంగా ప్రశ్నించారు.

పాఠశాలలో భోజనం బాగుంటుందంటూ మంత్రికి బదులిచ్చారు విద్యార్థులు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ఆ తర్వాత సమీపంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రాన్ని సైతం ఆయన సందర్శించారు. అందులోని చిన్న పిల్లలతో లోకేశ్ ముచ్చటించారు. ఆ తర్వాత పాఠశాల స్థితిగతులపై మైలవరం ఎంఈవో, హెడ్‌మాస్టర్‌తో లోకేశ్ మాట్లాడారు. ఆ క్రమంలో తనతో పాటు తెచ్చిన నివేదికపై ఎంఈఓతో లోకేశ్ చర్చించినట్లు తెలుస్తోంది.

ఉన్నతాధికారులు, పార్టీ శ్రేణులుకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రి లోకేశ్ ఈ పాఠశాలను సందర్శించారు. లోకేశ్ పర్యటనపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కూ ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. మంత్రి లోకేశ్ రాకను తెలుసుకున్న విద్యా శాఖ అధికారులు మైలవరానికి పరుగులు తీశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...