ఐదు మేకపిల్లల పంచాయితీ.. ప్రాణాలు తీసే వరకూ పోయిందీ

Date:

నెల్లూరు జిల్లా కావలిలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మేక పిల్లల దగ్గర మొదలైన పంచాయితీ పగల వరకూ వెళ్లి ప్రాణాలు తీశారు. ఓ యజమాని, కాపలా వ్యక్తి మధ్య మొదలైన వివాదం గ్రామ పెద్ద దగ్గరకు పంచాయితీగా వెళ్లింది. అక్కడ కాపలా వ్యక్తి గ్రామ పెద్దకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడటంతో.. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న గ్రామ పెద్ద. పక్కా ప్లాన్‌తో దాడి చేయించాడు.. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి మరణించడంతో పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు.

మేక పిల్లల పంచాయితీ ఒక మనిషి ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. ఓ యజమాని తన మేకను ఒకరి దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు.. ఆ మేకకు ఐదు పిల్లలు పుట్టాయి. అయితే, దాన్ని చూసిన వ్యక్తి తనకు రెండు మేక పిల్లలు కావాలి అనడం.. యజమాని ఇవ్వను అనడంతో మొదలైన గొడవ.. పెద్దమనిషి పంచాయితీ వరకూ వెళ్లింది. ఆ తర్వాత వివాదం పెద్దదవడంతో ఏకంగా మనిషి ప్రాణాలు తీసే వరకూ వెళ్లింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది.

గ్రామ పెద్ద, మాజీ సర్పంచ్ మందా మధు దృష్టికి జనార్దన్ ఈ గొడవను తీసుకెళ్లాడు. ఆ సమయంలో వాసు, సర్పంచ్ మధ్య మాటా మాటా పెరిగింది. దాంతో ఆగ్రహానికి గురైన గ్రామ పెద్ద మధు అతనికి ఎలాగైనా భయం పెట్టాలని అనుకున్నాడు. వాసును అడవిరాజుపాలెంలోని ఓ మద్యం దుకాణానికి ఈ నెల 10వ తేదీ తీసుకెళ్లారు. మద్యం తాగిన తర్వాత ముగ్గురితో కలిసి వాసుపై మధు దాడి చేయించాడు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...