
ఆంధ్రప్రదేశ్లో మండల పరిషత్ పీఠాలపై కూటమి జెండా ఎగిరింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 626 ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగగా, కూటమి 583 పదవులను కైవసం చేసుకుంది.
అలాగే 600 చోట్ల జరిగిన వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి సత్తా చాటింది. ఏకంగా 548 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు వైఎస్సార్సీపీకి 39 ఎంపీపీ, 40 వైస్ ఎంపీపీ పదవులు మాత్రమే దక్కాయి.
కడప సహా మొత్తం 13 జిల్లాల్లో వైఎస్సార్సీపీ ఒక్క ఎంపీపీ పదవిని కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఫలితాలతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఆధిపత్యం స్పష్టమైంది.
పార్టీల వారీగా, జిల్లాల వారీగా ఎన్నికల ఫలితాల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో కూటమి పార్టీలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. మొత్తం ఎంపీపీ పదవుల్లో 93.13 శాతం, వైస్ ఎంపీపీ పదవుల్లో 91.33 శాతం స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కైవసం చేసుకుంది. మరోవైపు వైఎస్సార్సీపీకి ఎంపీపీ పదవుల్లో కేవలం 6.24 శాతం మాత్రమే దక్కాయి. 13 జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీపీ పదవిని కూడా గెలుచుకోలేకపోయింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 ఎంపీపీ స్థానాలు ఉండగా, 626 మండలాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 534, జనసేన 42, బీజేపీ 7 స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ 39 మండలాల్లో ఎంపీపీ పదవులను దక్కించుకుంది.
ఇక వైస్ ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి జోరు కొనసాగింది. మొత్తం 600 స్థానాలకు ఎన్నికలు జరగగా, టీడీపీ 445, జనసేన 83, బీజేపీ 20 స్థానాల్లో విజయం సాధించాయి. వైఎస్సార్సీపీకి 40 వైస్ ఎంపీపీ పదవులు దక్కాయి.
ఇదిలా ఉంటే సీపీఎం ఒక ఎంపీపీ, మూడు వైస్ ఎంపీపీ స్థానాలను గెలుచుకుంది. మరోవైపు మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఎంపీపీలుగా విజయం సాధించారు. వీరిలో ఇద్దరు టీడీపీ రెబల్స్ కాగా, మరో స్వతంత్ర అభ్యర్థి బీజేపీలో చేరి ఎంపీపీ పదవిని చేపట్టారు.
ఈ ఫలితాలతో స్థానిక సంస్థల్లోనూ కూటమి తన పట్టును మరింత బలోపేతం చేసుకుంది.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 659 మండలాలు ఉండగా, 626 చోట్ల ఎంపీపీ ఎన్నికలు, 600 చోట్ల వైస్ ఎంపీపీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ విజయాన్ని నమోదు చేశాయి.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల వారీగా పార్టీల విజయాల వివరాలు ఇలా ఉన్నాయి:
| పార్టీ / వివరాలు | ఎంపీపీ | వైస్ ఎంపీపీ |
|---|---|---|
| మొత్తం మండలాలు | 659 | 659 |
| ఎన్నికలు జరిగినవి | 626 | 600 |
| కూటమి మొత్తం | 583 | 548 |
| టీడీపీ | 534 | 445 |
| జనసేన | 42 | 83 |
| బీజేపీ | 7 | 20 |
| వైఎస్సార్సీపీ | 39 | 40 |
| సీపీఎం | 1 | 3 |
| స్వతంత్రులు | 3 | 9 |
జిల్లాల వారీగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులను ఏయే పార్టీలు గెలుచుకున్నాయో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు మెజారిటీ మండల పరిషత్ పీఠాలను కైవసం చేసుకున్నాయి. రాష్ట్రంలోని 659 మండలాలకు గాను 33 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 626 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో టీడీపీ అత్యధికంగా 534 స్థానాల్లో విజయం సాధించగా, జనసేన 42, బీజేపీ 7 స్థానాలను దక్కించుకున్నాయి. వైఎస్సార్సీపీ 39 ఎంపీపీ స్థానాలకే పరిమితమైంది. ఇతరుల ఖాతాలో నాలుగు స్థానాలు చేరాయి.
జిల్లాల వారీగా మొత్తం మండలాలు, వాయిదా పడిన ఎన్నికలు, ఎన్నికలు జరిగిన స్థానాలు, పార్టీల వారీగా గెలుపొందిన ఎంపీపీ పదవుల వివరాలు కింద పట్టికలో చూడొచ్చు.
మండలాలు | వాయిదా | ఎన్నికలు | టీడీపీ | జనసేన | బీజేపీ | వైఎస్సార్సీపీ | ఇతరులు | |
|---|---|---|---|---|---|---|---|---|
| శ్రీకాకుళం | 30 | 2 | 28 | 27 | 0 | 1 | 0 | 0 |
| విజయనగరం | 27 | 1 | 26 | 25 | 0 | 0 | 1 | 0 |
| పార్వతీపురం మన్యం | 15 | 0 | 15 | 12 | 1 | 0 | 2 | 0 |
| విశాఖపట్నం | 4 | 0 | 4 | 3 | 1 | 0 | 0 | 0 |
| అనకాపల్లి | 24 | 0 | 24 | 20 | 2 | 0 | 1 | 1 |
| అల్లూరి సీతారామరాజు | 11 | 1 | 10 | 3 | 0 | 0 | 7 | 0 |
| తూర్పుగోదావరి | 21 | 0 | 21 | 14 | 4 | 1 | 2 | 0 |
| కాకినాడ | 20 | 1 | 19 | 14 | 5 | 0 | 0 | 0 |
| బీఆర్ అంబేద్కర్ కోనసీమ | 19 | 0 | 19 | 12 | 7 | 0 | 0 | 0 |
| పశ్చిమగోదావరి | 20 | 0 | 20 | 14 | 6 | 0 | 0 | 0 |
| ఏలూరు | 27 | 0 | 27 | 19 | 3 | 2 | 3 | 0 |
| పోలవరం | 12 | 1 | 11 | 6 | 1 | 0 | 3 | 1 (సీపీఎం) |
| కృష్ణా | 26 | 3 | 23 | 17 | 6 | 0 | 0 | 0 |
| ఎన్టీఆర్ | 16 | 0 | 16 | 16 | 0 | 0 | 0 | 0 |
| గుంటూరు | 13 | 0 | 13 | 12 | 1 | 0 | 0 | 0 |
| బాపట్ల | 20 | 1 | 19 | 18 | 1 | 0 | 0 | 0 |
| పల్నాడు | 28 | 2 | 26 | 26 | 0 | 0 | 0 | 0 |
| ప్రకాశం | 27 | 1 | 26 | 25 | 1 | 0 | 0 | 0 |
| మార్కాపురం | 21 | 4 | 17 | 17 | 0 | 0 | 0 | 0 |
| నెల్లూరు | 35 | 0 | 35 | 32 | 1 | 1 | 1 | 0 |
| చిత్తూరు | 27 | 0 | 27 | 24 | 0 | 0 | 3 | 0 |
| తిరుపతి | 35 | 5 | 30 | 27 | 1 | 0 | 2 | 0 |
| కడప | 39 | 4 | 35 | 31 | 1 | 2 | 0 | 1 |
| అన్నమయ్య | 25 | 1 | 24 | 20 | 0 | 0 | 4 | 0 |
| అనంతపురం | 31 | 2 | 29 | 28 | 0 | 0 | 1 | 0 |
| శ్రీసత్యసాయి | 32 | 1 | 31 | 27 | 0 | 0 | 3 | 1 |
| నంద్యాల | 28 | 2 | 26 | 21 | 0 | 0 | 5 | 0 |
| కర్నూలు | 26 | 1 | 25 | 24 | 0 | 0 | 1 | 0 |
| మొత్తం | 659 | 33 | 626 | 534 | 42 | 7 | 39 | 4 |
