అమరావతిలో మరో ఫైవ్ స్టార్ హోటల్.. రూ.300 కోట్లతో 200 గదులు.. యువతకు ఉద్యోగాలు

Date:

అమరావతిలో మరో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటకానుంది. రాజధానిలోని శాఖమూరులో క్రౌన్‌ ప్లాజా ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణ పనులు ప్రారంభించారు. మొత్తం 4 ఎకరాలలో 200 గదులు ఉండేలా రూ.300 కోట్లతో ఈ హోటల్‌ను నిర్మించనున్నారు. ఈ హోటల్ రాకతో 500 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటీవలే మరో స్టార్ హోటల్‌ కూడా అమరావతిలో ఏర్పాటు చేేసేందుకు ఒప్పందం చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది.. ఈ క్రమంలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు వరుసగా క్యూ కడుతున్నాయి. అయితే పర్యాటకరంగంలో పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేకంగా పాలసీని కూడా రూపొందించింది. ఇటీవల కాలంలో పర్యాటకరంగంలో కూడా పెట్టుబడులకు ప్రముఖ హోటల్స్ కూడా ఆసక్తి చూపాయి. తాజాగా రాష్ట్ర రాజధాని అమరావతికి మరో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణంలో ముందడుగు పడింది. ఇండ్‌రాయల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్టియం ఆధ్వర్యంలో శాఖమూరు దగ్గర నాలుగు ఎకరాల విస్తీర్ణంలో క్రౌన్‌ ప్లాజా 5 స్టార్‌ హోటల్‌ను నిర్మించనున్నారు.

ఈ స్టార్ హోటల్‌ను రూ.300 కోట్లతో.. మొత్తం 200 గదులతో నిర్మించనున్నారు.. దాదాపు 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇండ్‌రాయల్ హోటల్స్ ప్రతినిధులు తెలిపారు. అమరావతిలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తు్న్నామని.. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి సమానంగా విస్తరించే క్రమంలో సంస్థలకు భూములు కేటాయించి, వాటి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూస్తున్నామని సీఆర్డీఏ తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...