చంద్రబాబుకు ఊరట.. మూడు పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు, గత ప్రభుత్వ హయాంలో కేసు

Date:

ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును పిటిషన్లు దాఖలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. గత ప్రభుత్వ హయాంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు అంశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును సీబీఐకి అప్పగించాలని, అలాగే గతంలో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణను ఏసీబీ కోర్టు నుంచి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ మూడు పిటిషన్లకు విచారణార్హత లేదని హైకోర్టు తెలిపింది.. వాటిని కొట్టివేసింది.

ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ మూడు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని సీఐడీ తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు ఈ కేసు విచారణను బదిలీ చేయాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ కోర్టులో వాదించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున వాదనలు వినిపించేందుకు రోహత్గీ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. ఈ నెల 18న జరిగిన విచారణలో మరోసారి రోహత్గీ వాదనలు వినిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ కేసు దర్యాప్తు పూర్తి చేసిన విషయాన్ని కోర్టుకు వివరించారు ముకుల్ రోహత్గీ. సీఐడీ ఏసీబీ కోర్టులో మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌ కింద ఇప్పటికే తుది నివేదిక దాఖలు చేసిందని గుర్తు చేశారు. అలాగే అసాధారణ సందర్భాల్లో మాత్రమే సీబీఐకి కేసుల్ని అప్పగిస్తారని గుర్తు చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...