Weather Alert: సుర్రుమంటున్న సూరీడు ఏపీ, తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఇదిగో వెదర్ రిపోర్ట్.

Date:

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి.. 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా.. ఏపీలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వేసవి ఆరంభంలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. శనివారం ఏపీలోని 90 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వాతావరణ అంచనా వేస్తోంది.

మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్​ నగర్ జిల్లాలో ఎండలు దంచికొట్టే వీలుందని హెచ్చరించారు.

దీంతో వికారాబాద్​, నారాయణపేట, మహబూబ్​నగర్​, జోగుళాంబ గద్వాల, నాగర్​ కర్నూల్​, వనపర్తి, సంగారెడ్డి జిల్లాల్లో కూడా 41 నుంచి 44 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని, ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్​ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్​ ప్రకటించింది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకెంతలా ముదురుతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోండి.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ఎండ దెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా మంచి నీరు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...