జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎవరైనా నామినేషన్ వేయవచ్చంటూ పేర్కొన్నారు. మన్సిపల్, పరిషత్ ఎన్నికల తరహాలోనే సీట్ల పంపకం ఉండదని, ఎవరైనా పోటీ చేయవచ్చని తెలిపారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసేన కీలక ప్రకటన చేసింది. ఎక్కడైనా జనసేన శ్రేణులు స్వేచ్ఛగా పోటీ చేయవచ్చంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీకి రాజకీయపరమైన అడ్డంకులు ఉండవంటూ స్పష్టం చేశారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఉన్నట్టు.. పంచాయతీ ఎన్నికల్లో సర్దుబాట్లు, సీట్ల పంపకాలు ఉండవని తేల్చిచెప్పారు. జనసేన నాయకులు, వీర మహిళలు ఎవరైనా నామినేషన్ వేయవచ్చంటూ తేల్చి చెప్పారు. ఈ మేరకు జనసేన పేరుతో ఆదివారం ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూటమి పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది. కొన్ని స్థానాల్లో సీట్ల పంపకం క్లిష్టతరంగా మారింది. కూటమి పార్టీలకు కూడా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకం పెద్ద సవాల్‌గా మారింది. కొన్ని స్థానాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.

