
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ZPTC, MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలుస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన పోలింగ్‌కు సంబంధించిన ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం అధికారులు 365 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ ఎన్నికల్లో మొత్తం 577 ZPTC, 7,707 MPTC స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా, 77 ZPTC, 2,051 MPTC స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఏకగ్రీవ స్థానాల్లో టీడీపీకి ఆధిక్యం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ZPTC స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి:
- పల్నాడు: మొత్తం 28 ZPTC స్థానాల్లో 18 స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం.
- ప్రకాశం: 2 ZPTC స్థానాలు టీడీపీకి ఏకగ్రీవం.
- మార్కాపురం: టీడీపీ 5, జనసేన 1 ZPTC స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి.
- నెల్లూరు: టీడీపీ 5 ZPTC స్థానాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది.
- చిత్తూరు: టీడీపీ 3 ZPTC స్థానాల్లో ఏకగ్రీవ విజయం సాధించింది.
- తిరుపతి: టీడీపీ 4 ZPTC స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది.
- కడప: టీడీపీ 19, బీజేపీ 3, జనసేన 1 ZPTC స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి.
- https://dtvandhrapradesh.com
దుత్తలూరులో టీడీపీ ఆధిక్యం
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ZPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ లెక్కింపులో టీడీపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యంలో నిలిచారు.
పార్టీల వారీగా వచ్చిన ఓట్లు:
- టీడీపీ: 52
- వైసీపీ: 11
- బీఎస్పీ: 3
- కాంగ్రెస్: 1
- తిరస్కరణకు గురైన ఓట్లు: 2https://dtvandhrapradesh.com
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీడీపీ 52 ఓట్లతో ముందంజలో ఉండగా, వైసీపీ 11 ఓట్లతో వెనుకబడి ఉంది. మిగిలిన బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.
Devarapalli Counting: దేవరపల్లిలో టీడీపీ ZPTC అభ్యర్థి లీడ్
తూ.గో. జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల తెక్కింపు
దేవరపల్లి మండలం జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ టీడీపీ లీడ్
దేవరపల్లి మండలంలో మొత్తం 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
టీడీపీ 134, వైసిపి 49 , కాంగ్రెస్ 2 , నోటా 1 ,ఇన్వాలిడ్ 3
