డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బందితో పాటు విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా సందేశాన్ని పంచుకున్నారు.

నాలుగు దశాబ్దాలుగా వైద్య విద్య, పరిశోధన, ప్రజారోగ్య రంగాల్లో ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. దివంగత ఎన్టీఆర్ సంకల్పంతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం నాణ్యమైన వైద్య విద్యను అందిస్తూ సమాజానికి సేవ చేసే నిబద్ధత కలిగిన వైద్యులను తీర్చిదిద్దడం గర్వకారణమని అన్నారు.

వైద్యం అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత అని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. సాంకేతికత వైద్య రంగానికి శక్తిని అందిస్తే, మానవత్వం ఆ సేవలకు మరింత విలువను చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు.

40 ఏళ్ల వైద్య సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రూబీ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న విశ్వవిద్యాలయ కుటుంబ సభ్యులందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *