ఎల్‌నీనో ప్రభావంతో ఈ సీజన్‌లో చలి పెద్దగా ఉండదు అనుకున్నాం.. కానీ బయట మాత్రం పరిస్థితి మరోలా ఉంది.. రాత్రి వేలల్లో చలి చంపేస్తుంది. రాబోయే ఈరోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగే ఉంది. ఈ చలిని తట్టుకోవాలంటే మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి వింటర్‌ శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాలు ఏవి.. వాటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.

శీతాకాలం వచ్చేసింది. సాయంత్రం అయిందంటే చాలు చలి పంజా విసురుతోంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని లోపలి నుంచి వేడిగా ఉంటే ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. బాడీని వేడి ఉంటే ఆహారాల్లో బాదం కూడా ఒకటి. ఇది టేస్ట్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ర్యాన్ ఫెర్నాండో తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. చలికాలంలో బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇందులో ఉండే పోషకాలు జీవక్రియలు, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఇందుకోసం బాదంను నానబెట్టి లేదా పొడిగా చేసుకొని పాలలో కలిపి తీసుకోవచ్చని తెలిపారు.

అయితే కొంత మంది బాదం పొట్టు తీసి తింటారు. కానీ పొట్టుతో సహా తిన్నా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. బాదంలో విటమిన్ ఇ, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సమతుల్య ఆహారంలో భాగంగా ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతే కాదు శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచడంలో సహాయపడుతాయి.

రోజుకు ఎన్ని బాదం తినాలి?: నిపుణుల సూచనల ప్రకారం ఎప్పటి నుంచో బాదం తినే అలవాటు ఉన్న వారు రోజుకు 20 నుంచి 25 గ్రాముల వరకు తినవచ్చు, ఇప్పుడే కొత్తగా బాదం తినడం స్టార్ట్ చేసిన వారు రోజుకు 6-10 వరకు బాదం పప్పులు తినవచ్చు. వాటికి మీ బాడీ రియాక్ట్‌ అయ్యే విధానాన్ని బట్టి పరిమాణాన్ని తగ్గించడం లేదా పెంచుకోవడం చేయవచ్చు.

అయితే కొంతమందికి బాదం తిన్నప్పుడు జీర్ణ సమస్యలు లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాదం అలర్జీ ఉన్నవారు వాటికి దూరంగా ఉండడం మంచిది. గమనిక: బాదం ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ, ఇది ఒక్కటే రోగనిరోధక శక్తిని పెంచదు. సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం కూడా ఆరోగ్యానికి అవసరం.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *