కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

Date:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ విజయవంతం అనంతరం కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్న పవన్. ఇటీవల డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు.

అయితే పవన్ భుజానికి సర్జరీ సక్సెస్ కావడంతో ఆయన ఆరోగ్యం కోసం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పవన్ సతీమణి అన్నా లెచినోవా తిరుమల చేరుకున్నారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె. రోడ్డు మార్గంలో తిరుపతిలోని అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలంటూ అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు.

శుక్రవారం వరహ స్వామిని దర్శించుకున్న ఆమె.. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఎలాంటి ఆడంబరం, సెక్యూరిటీ లేకుండానే అన్నా లెజినోవా అలిపిరి మెట్లమార్గంలో నడుస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ మరో నాలుగు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి వైద్యులు సూచించినట్లు సమాచారం. హైదరాబాద్ లోని నివాసం తీసుకుంటున్నారు పవన్. మరో నాలుగు వారాలపాటు ఆయన భుజానికి ఫిజియోథెరపి నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. పవన్ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుందని తెలిపారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...