ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్తగా 100 ఏసీ బస్సులు.. ఇక ప్రయాణం మరింత సులభం!

Date:

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు మధ్య రాకపోకలు సాగించేందుకు 100 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను కేటాయించింది. వీటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

రాష్ట్రంలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి తేదీ ఖరారు కావడంతో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు సుమారు 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. ఈ నిర్ణయంలో భాగంగా తొలి దశలో 4 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ బస్సులు కుర్మన్నపాలేనికి చేరుకున్నాయి. ఈ కొత్త ఈవీ బస్సులు విశాఖ నుంచి రెండు మార్గాల్లో భోగాపురం ఎయిర్‌పోర్టు మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ప్రస్తుతం ఈ బస్సులను భోగాపురం ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే అధికారుల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది.

కొత్త ఈవీ ఏసీ బస్సుల ప్రత్యేకతలు ఇవే: విశాఖపట్నం-భోగాపురం మధ్య తిరిగేందుకు ప్రభుత్వం కేటాయించిన ఈ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఈ బస్సులో మొత్తం 40 సీట్లు ఉంటాయి. ఇవి ఇంధన రహిత (ఎలక్ట్రిక్) వాహనాలు కావడంతో పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు. వీటి వల్ల శబ్ద, వాయు కాలుష్యాలు ఉండవు. ప్రయాణికులు ఎక్కి దిగేందుకు వీలుగా ఇందులో అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. బస్టాప్ రాగానే బస్సును ఆపేందుకు వీలుగా ప్రత్యేక అలారం బటన్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.

మొదటి మార్గం: గాజువాక నుంచి బయల్దేరి ఎన్‌ఏడీ జంక్షన్, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతువాక, మధురవాడ, ఆనందపురం, తగరపువలస మీదుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ రూట్‌లో సుమారు 10 ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

రెండవ మార్గం: గాజువాక, సింధియా, రైల్వే స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్ (RTC కాంప్లెక్స్), వుడా పార్క్, రుషికొండ, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరపువలస మీదుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ రూట్‌లో కూడా ప్రయాణికుల సౌకర్యార్థం మరో 10 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం మీద తొలి విడతలో భాగంగా 20 బస్సులను ప్రయాణికుల కోసం నడపనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....