
అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుండగా బుధవారం కూడా పసిడి ధరలు దిగివచ్చాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,980గా నమోదైంది. మంగళవారం ధరతో పోలిస్తే రూ.710 తగ్గింది.
అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,30,150గా ఉంది. గత రోజుతో పోలిస్తే రూ.650 మేర దిగివచ్చింది.
ఏపీలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| విజయవాడ | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
| విశాఖపట్నం | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
| అమరావతి | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
| కాకినాడ | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
| తిరుపతి | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
తెలంగాణలోని పలు నగరాల్లో 10 గ్రాముల పసిడి ధరలు..
| నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
| హైదరాబాద్ | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
| వరంగల్ | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
| నిజామాబాద్ | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
| ఖమ్మం | ₹1,41,980 | ₹1,30,150 | ₹1,06,490 |
