ఏపీ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక శుభవార్త అందించింది. అరుణాచలంలో ఘనంగా నిర్వహించే కార్తిగై దీపం వేడుకను పురస్కరించుకుని ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి అరుణాచలానికి ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటు చేసింది.

అంతేకాకుండా తిరుపతి నుంచి విశాఖపట్నానికి కూడా ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. కార్తిగై దీపం వేడుకకు వెళ్లాలనుకునే ఏపీ భక్తులకు ఈ ప్రత్యేక రైళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. భక్తులు ఈ రైలు సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. అక్కడ నిర్వహించే ప్రసిద్ధ కార్తిగై దీపం (కార్తీక దీపం) వేడుకలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును నడపనున్నట్లు ప్రకటించింది.

కార్తిగై దీపోత్సవం సందర్భంగా తిరువణ్ణామలైకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తుల ప్రయాణ సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి తిరువణ్ణామలైకు 08579/08580 నంబర్లతో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సదుపాయాన్ని అరుణాచలం వెళ్లే భక్తులు వినియోగించుకోవాలని సూచించారు.

విశాఖపట్నం నుంచి తిరువణ్ణామలైకి నడిచే ప్రత్యేక రైలు (08579) నవంబర్ 22, 2026 ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు నవంబర్ 23, సోమవారం సాయంత్రం 5.50 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది.

అదేవిధంగా తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలై నుంచి విశాఖపట్నానికి నడిచే ప్రత్యేక రైలు (08580) నవంబర్ 23న రాత్రి 9 గంటలకు బయలుదేరి, నవంబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో రైలు ఆగుతుంది:

దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి స్టేషన్లలో ఈ ప్రత్యేక రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

రైలు కోచ్‌ల వివరాలు:

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 4 జనరల్ సిట్టింగ్ కోచ్‌లు, 2 GSC లగేజీ కోచ్‌లు, 2 సెకండ్ ఏసీ కోచ్‌లు, 6 థర్డ్ ఏసీ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

కార్తిగై దీపోత్సవానికి అరుణాచలం వెళ్లే ఏపీ భక్తులు ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

మరోవైపు తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య కూడా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు 07423, 07424 నంబర్లతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.

తిరుపతి – విశాఖపట్నం ప్రత్యేక రైలు (07423) నవంబర్ 21, 2026 శనివారం రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు నవంబర్ 22 ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం:

రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

కోచ్‌ల వివరాలు:

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 4 జనరల్ సిట్టింగ్ కోచ్‌లు, 2 GSC లగేజీ కోచ్‌లు, 2 సెకండ్ ఏసీ కోచ్‌లు, 6 థర్డ్ ఏసీ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

కార్తిగై దీపోత్సవం సందర్భంగా ప్రయాణించే భక్తులు ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

విశాఖపట్నం నుంచి తిరుపతికి నడిచే ప్రత్యేక రైలు (07424) నవంబర్ 24, 2026 మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి, మరుసటి రోజు నవంబర్ 25 బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం:

దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

కోచ్‌ల వివరాలు:

ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 4 జనరల్ సిట్టింగ్ కోచ్‌లు, 2 GSC లగేజీ కోచ్‌లు, 2 సెకండ్ ఏసీ కోచ్‌లు, 6 థర్డ్ ఏసీ కోచ్‌లు, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు.

టికెట్ ఛార్జీల్లో మార్పులు

తిరుపతి – విశాఖపట్నం – తిరుపతి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు (07423, 07424) టికెట్ ఛార్జీలు సాధారణ ధరల కంటే 1.3 రెట్లు అధికంగా ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

కార్తిగై దీపోత్సవం సందర్భంగా అరుణాచలం (తిరువణ్ణామలై) వెళ్లే భక్తులు ఈ ప్రత్యేక రైళ్ల సదుపాయాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *