ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల విధులకు చెల్లించే పారితోషికం, గౌరవ వేతనాలతో పాటు భోజనం, అల్పాహార ఖర్చులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమాద పరిహారంలోనూ మార్పులు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం 1345, 1346 జీవోలను విడుదల చేసింది.

వివిధ కేటగిరీలకు పెరిగిన పారితోషికం

  • ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్‌వైజర్లు: రూ.350 నుంచి రూ.500కు.
  • పోలింగ్ అధికారులు: రూ.250 నుంచి రూ.400కు.
  • కౌంటింగ్ అసిస్టెంట్లు: రూ.250 నుంచి రూ.450కు.
  • నాలుగో తరగతి సిబ్బంది: రూ.150 నుంచి రూ.350కు.
  • కాల్‌సెంటర్, కంట్రోల్ రూమ్ సిబ్బంది: రూ.200 నుంచి రూ.1,000 వరకు.
  • ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాల్లో మొదటి, రెండో తరగతి సిబ్బంది: రూ.1,200 నుంచి రూ.3,000 వరకు.
  • మూడో తరగతి సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు: రూ.2,000 వరకు.

సీఏపీఎఫ్ సిబ్బందికీ పెంపు

ఎన్నికల విధుల్లో పాల్గొనే సీఏపీఎఫ్ గెజిటెడ్ అధికారులకు 15 రోజుల వరకు ఇచ్చే పారితోషికాన్ని రూ.2,500 నుంచి రూ.4,000కు పెంచారు. వారం నుంచి 15 రోజుల మధ్య విధులు నిర్వహిస్తే రూ.2,000 చెల్లిస్తారు.

సబార్డినేట్ అధికారులకు 15 రోజుల వరకు రూ.3,000, ఇతర ర్యాంకుల సిబ్బందికి రూ.2,500 చెల్లించనున్నారు. సహాయ వ్యయ పరిశీలకుల పారితోషికాన్ని రూ.7,500 నుంచి రూ.10,000కు పెంచారు.

తాజా నిర్ణయంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పెరిగిన పారితోషికంతో పాటు ప్రమాద పరిహారంలోనూ ప్రయోజనం కలగనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *