థియేటర్లో డిజాస్టర్‌.. ఓటీటీ స్ట్రీమింగ్‌కి సిద్ధమైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. డేట్ ఎప్పుడంటే

Date:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ఏప్రిల్ 23, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ మూవీ ‘ధురంధర్ 2’ ప్రభంజనం ఈ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. సుమారు రూ. 122 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం రూ. 94 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించి, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతేడాది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఆ జోష్‌లోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ’ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆశించినా ఫలితం మాత్రం నిరాశ కలిగించింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్చి 19, 2026న థియేటర్లలోకి వచ్చింది. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉన్నప్పటికీ పాతకాలపు మాస్ ఫార్ములా, బోరింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు మైనస్‌గా మారాయి. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తర్వాత, అంటే ఏప్రిల్ 23 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...