తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఓ భక్తుడు భారీ కానుకను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా 121 కిలోల బంగారు ఆభరణాలను స్వామివారికి విరాళంగా అందించనున్నారు. ఈ మేరకు కానుక సమర్పణకు సంబంధించిన విషయాలపై ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో చర్చించి, అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ నెల 26న తిరుమలకు చేరుకోనున్న సదరు భక్తుడు.. బంగారు ఆభరణాలను ఆలయ అధికారులకు భక్తిశ్రద్ధలతో అందజేయనున్నారు. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించేందుకు ముందుకు రావడం తిరుమలలో ఆసక్తికరంగా మారింది.

తిరుమల ఏడుకొండల స్వామివారిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ ఓ దాత భారీ కానుకను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. సుమారు 121 కిలోల బరువున్న విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి విరాళంగా అందించనున్నారు. ఈ కానుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ స్వర్ణాభరణాల విలువ దాదాపు రూ.150 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా తమ కోరికలు నెరవేరినప్పుడు భక్తులు ఏడుకొండల స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ స్థాయిలో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను విరాళంగా అందించేందుకు ఓ దాత ముందుకు రావడం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది. ఈ అపూర్వ కానుక తిరుమల చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలిచిపోనుందని భావిస్తున్నారు.

బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించే విషయంపై సదరు దాత ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులతో చర్చించారు. కానుక అందజేతకు సంబంధించి అవసరమైన లాంఛనాలను సైతం పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ నెల 26న తిరుమలకు చేరుకోనున్న సదరు భక్తుడు బంగారు ఆభరణాలను ఆలయ అధికారులకు భక్తిశ్రద్ధలతో అందజేయనున్నారు. శ్రీవారి నిత్య కైంకర్యాలు, వివిధ అలంకరణల సమయంలో వినియోగించేందుకు వీలుగా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా తయారు చేయించినట్లు తెలుస్తోంది.

ఆలయ చరిత్రలోనే సరికొత్త రికార్డు!

తిరుమల ఆలయ చరిత్రలో ఒక వ్యక్తిగత భక్తుడు ఇంత భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను కానుకగా అందించడం ఇదే తొలిసారి అని టీటీడీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు వ్యక్తిగత భక్తుల నుంచి అందిన విరాళాలతో పోలిస్తే ఈ కానుక ప్రత్యేకంగా నిలవనుందని సమాచారం. శ్రీవారి ఆభరణాల సంపదకు ఇది విలువైన చేరిక కానుందని అధికారులు భావిస్తున్నారు. దాత చూపిన అపారమైన భక్తి, దాతృత్వంపై టీటీడీ వర్గాలు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నాయి.

121 కిలోల బంగారు ఆభరణాల వెనుక ప్రత్యేక సంకల్పం!

ఈ భక్తుడు 121 కిలోల బంగారు ఆభరణాలనే ఎందుకు సమర్పించాలనుకుంటున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవారి నిత్య అలంకరణలు, అభిషేకాలు, విశేష ఉత్సవాల సమయంలో మూలవిరాట్టుకు అలంకరించే బంగారు ఆభరణాల మొత్తం బరువు సుమారు 120 కిలోల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఈ ఆభరణాల్లో సాలగ్రామ హారాలు, కిరీటం, లక్ష్మీ హారాలు, శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, కటిహస్తం, వరదహస్తం, పాదాభరణాలు తదితరాలు ఉన్నాయి. స్వామివారి అలంకరణకు అవసరమైన ఆభరణాలన్నింటినీ తనే తయారు చేయించి సమర్పించాలనే సంకల్పంతో 120 కిలోలకు అదనంగా మరో కిలో బంగారంతో కలిపి మొత్తం 121 కిలోల ఆభరణాలను కానుకగా అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *