
అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కొనసాగిన సమయంలో కొందరు చేసిన తప్పుడు ఫిర్యాదుల కారణంగా జగన్ చేతిలో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
తాను స్వచ్ఛందంగా వైసీపీని వీడలేదని, కొందరు వెళ్లే పరిస్థితులు కల్పించారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగడం ఇష్టం లేకే బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు.
సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 11న కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయడం కోసమే పార్టీని స్థాపిస్తున్నట్లు వివరించారు. తన పార్టీ రెండు కులాలు లేదా రెండు కుటుంబాలకు పరిమితమైనది కాదని, అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
