IND vs SA: గువాహటి టెస్ట్‌లో టీమిండియా పతనం… సఫారీల చేతిలో వైట్‌వాష్

Date:

గువాహటి టెస్టులో టీమిండియా కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో విజయం నమోదు చేసింది. సైమన్ హార్మర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఆరు వికెట్లు పడగొట్టాడు. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా (54; 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరిగా పోరాడి టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఓటమితో సిరీస్‌ను టీమిండియా 2-0తో కోల్పోయి, సఫారీల చేతిలో వైట్‌వాష్ ఎదుర్కొంది. అలాగే దాదాపు 25 సంవత్సరాల తర్వాత తొలిసారి దక్షిణాఫ్రికా భారత భూమిపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో ఇది టీమిండియా ఎదుర్కొన్న అత్యంత భారీ పరాజయంగా నిలిచింది.

27/2 ఓవర్నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట ప్రారంభించిన భారత్, పెను సమస్యల్లో పడ్డది. వరుసగా వికెట్లు కోల్పోతూ ఒకానొక దశలో 58/5 వద్ద కుప్పకూలే పరిస్థితికి చేరింది. ఈ సమయంలో జడేజా ధైర్యంగా పోరాడటంతో స్కోరు 140 వరకూ చేరింది. సాయి సుదర్శన్ (14) 139 బంతులు ఎదుర్కొన్నా పెద్దగా ఉపయోగం కాలేదు. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6), ధ్రువ్ జురేల్ (2), రిషబ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0) వంటి బ్యాటర్లు ఒక్కొక్కరిగా విఫలమయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ హార్మర్ అత్యుత్తమ స్పెల్ విసిరి కేవలం 37 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. కేశవ్ మహరాజ్ రెండు వికెట్లు, ముత్తుసామి మరియు మార్కో యాన్సెన్ చెరో వికెట్ సాధించారు. ఇప్పటికే కోల్కతా టెస్టు గెలిచిన దక్షిణాఫ్రికా, గువాహటి టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...