D Educt: Nov 7: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ఎన్‌రోల్డ్‌ పర్సన్స్‌ టెస్ట్‌ (CGEPT) 2027 బ్యాచ్‌ పరీక్షలు నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం నగర వివరాలను (సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు) అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌ నుంచి కోస్ట్‌ గార్డ్‌ పరీక్షా పోర్టల్‌లోకి లాగిన్‌ అయి తమ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను పరిశీలించుకోవచ్చు. అలాగే పరీక్ష తేదీకి రెండు, మూడు రోజుల ముందు అడ్మిషన్‌ సర్టిఫికేట్‌ (అడ్మిట్‌ కార్డు) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.