IRCTC Bali Tour Package 2026 Telugu: బాలీ టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారికి IRCTC మంచి అవకాశం కల్పిస్తోంది. 4 రాత్రులు, 5 రోజుల ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.94,700 నుంచి ప్రారంభమవుతుంది. ప్యాకేజీలో విమాన ప్రయాణం, 3-స్టార్ హోటల్‌లో వసతి, భోజనం, వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి. వీటితో పాటు బాలీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కూడా కల్పిస్తున్నారు. తక్కువ సమయంలో బాలీ అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది.

IRCTC Bali Tour Package Telugu: బాలీ.. ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, పచ్చని వరి పొలాలు, పురాతన హిందూ దేవాలయాలు, విలాసవంతమైన రిసార్టులు, సందడిగా ఉండే నైట్‌లైఫ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. ఇలాంటి అందమైన బాలీని సందర్శించాలనుకునే పర్యాటకుల కోసం IRCTC 4 రాత్రులు, 5 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది.

ఈ ప్యాకేజీ 2026 సెప్టెంబర్ 24 నుంచి 29 వరకు కొనసాగుతుంది. చెన్నై నుంచి విమాన ప్రయాణంతో టూర్ ప్రారంభమవుతుంది. ప్యాకేజీలో ఎకానమీ క్లాస్ విమాన టికెట్లు, 3-స్టార్ హోటల్‌లో 4 రాత్రుల వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్థానిక రవాణా, సందర్శనా స్థలాల ప్రవేశ టికెట్లు ఉన్నాయి. అలాగే ఇంగ్లిష్ మాట్లాడే ప్రొఫెషనల్ గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూరిస్ట్ వీసా, GST, TCS వంటి సదుపాయాలు కూడా ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి.

టూర్‌లో సందర్శించే ప్రదేశాలు

మొదటి రోజు: బాలీ చేరుకున్న అనంతరం జింబరన్ బీచ్‌ను సందర్శిస్తారు.

రెండో రోజు: ఉబుద్, కింటామణి, మౌంట్ బాతుర్, లేక్ బాతుర్, సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, తిర్తా ఎంపుల్ ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. అలాగే బరోంగ్, కెరిస్ సంప్రదాయ నృత్య ప్రదర్శనలను వీక్షించవచ్చు.

మూడో రోజు: తంజుంగ్ బెనోవా బీచ్, టర్టిల్ ఐలాండ్, ఉలువాటు టెంపుల్ సందర్శన ఉంటుంది. అనంతరం కెచక్ డ్యాన్స్‌ను వీక్షిస్తూ బాలీ సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు.

నాలుగో రోజు: తమన్ అయున్ టెంపుల్, ఉలున్ దాను బ్రటాన్ టెంపుల్, తానా లాట్ టెంపుల్‌ను సందర్శిస్తారు.

ప్యాకేజీ ధర ఎంతంటే?

కంఫర్ట్ కేటగిరీలో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.1,02,300గా ధర నిర్ణయించారు. డబుల్ లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.94,700 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.88,050, బెడ్ లేకుండా రూ.84,350గా ధర ఉంది. ఈ ప్యాకేజీ ధరలో 2 శాతం TCS కూడా చేర్చారు.

అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకునే వారు మొత్తం ప్యాకేజీ ధరలో 30 శాతం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయ ప్రయాణం కావడంతో ప్రయాణికుల పాస్‌పోర్ట్‌కు కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉండాలి.

అయితే విమాన సమయాలు, హోటల్ వసతి, టూర్ షెడ్యూల్ తదితర అంశాల్లో ఆపరేషనల్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండే అవకాశం ఉందని IRCTC తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *