మగువల కళ్లకు మెరుపునిచ్చే కాటుక సీక్రెట్స్‌, మహిళలు కళ్లకు కాటుక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

Date:

భారతీయ మహిళల అందం గురించి చెప్పాలంటే కళ్లకు పెట్టుకునే కాటుక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. నేటి కాలంలో కాజల్ కేవలం మేకప్‌లో భాగంగా మారిపోయినా, ఒకప్పుడు అది భారతీయ సంస్కృతి, ఆయుర్వేదం, సంప్రదాయంలో విడదీయరాని భాగంగా ఉండేది. కళ్ల అందాన్ని పెంచడమే కాకుండా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటం, దృష్టిదోషం నుంచి రక్షణ కల్పించడం వంటి కారణాలతో కూడా దీనిని ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో కళ్లకు కాటుక పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మన ముఖానికి చక్రాల్లాంటి కళ్లు ఎంత అందమో.. కళ్లకు కాటుక కూడా అంతే అందం. అందుకే కాజల్‌ అప్లయ్‌ చేయకుండా మేకప్‌ కూడా పూర్తి కాదు మరి. ఇది ఇప్పటి  కాదు వేల సంవత్సరాల క్రితమే భారతీయ మహిళలు కాటుకను తమ నిత్య జీవితంలో భాగంగా మార్చుకున్నారు. అప్పట్లో ఇది ఫ్యాషన్ కోసమే కాదు, కంటి సంరక్షణ, సంప్రదాయం, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ముడిపడి ఉండేది.

చరిత్రకారుల ప్రకారం సింధు నాగరికత కాలం నుంచే భారతీయులు కాటుకను ఉపయోగించేవారు. అప్పట్లో మహిళలే కాకుండా పురుషులు, చిన్నారులు కూడా కాటుక పెట్టుకునేవారని ఆధారాలు సూచిస్తున్నాయి. అందుకే ప్రాచీన భారతీయ మహిళలు కాటుక లేకుండా ఇంటి గడప దాటేవారు కాదని చరిత్ర చెబుతోంది. మరి కాటుకకు అంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కాటుక చరిత్ర సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. పూర్వకాలంలో ఆముదం నూనె, లేదా వచ్చే మసిని సేకరించి, అందులో కర్పూరం, గంధం వంటి సహజ పదార్థాలు కలిపి కాటుక తయారు చేసేవారు. ఇది కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాకుండా రోజువారీ జీవనంలో భాగంగా ఉండేది. ఆయుర్వేద గ్రంథాల్లో కూడా అంజనాన్ని కంటి సంరక్షణలో ఉపయోగించే పదార్థంగా పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...