పంజాబ్‌లోని పటియాలా సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్ వైపు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. మంటలు వేగంగా వ్యాపించి పలు బోగీలకు అంటుకున్నాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఐదు బోగీలకు వ్యాపించిన మంటలు

అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రైలులో మొదట చెలరేగిన మంటలు కొద్ది సేపటికే పక్కనే ఉన్న బోగీలకు వ్యాపించాయి. మొత్తం ఐదు బోగీలు మంటల బారినపడినట్లు సమాచారం. వాటిలో నాలుగు బోగీలు తీవ్రంగా దగ్ధమవుతున్నట్లు ప్రాథమిక కథనంలో పేర్కొన్నారు.

తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు

అగ్నిప్రమాదం సమయంలో ప్రయాణికులు అప్రమత్తమై బోగీల నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, రైలు ప్రయాణాలపై ప్రభావం వంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Live Updates in DTV Digital