దేశంలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి, మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతూ ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునను ఆయన స్వయంగా కలిసి ఆహ్వానించారు.

నాగార్జున నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి.. డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం ఇద్దరూ కలిసి యాత్రకు సంబంధించిన టీ-షర్టులను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారిని అంతం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం చేపట్టే కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహిత భారత్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటంతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

డ్రగ్స్ మహమ్మారిపై పోరాటంలో సినీ, రాజకీయ ప్రముఖులు చేతులు కలుపుతున్నారు. ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తన మద్దతు ప్రకటించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం నాగార్జునను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఆయన నివాసానికి వెళ్లి యాత్ర లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించారు.

అనంతరం కిషన్ రెడ్డితో కలిసి నాగార్జున యాత్రకు సంబంధించిన టీ-షర్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. డ్రగ్స్ నిర్మూలన కోసం చేపట్టే ప్రతి కార్యక్రమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల వ్యసనం సమాజాన్ని, ముఖ్యంగా యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తోందని పేర్కొన్నారు.

డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని నాగార్జున సూచించారు. ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ఇలాంటి ప్రజా ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్’ పిలుపు మేరకే ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 2029 నాటికి దేశాన్ని పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా మార్చాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంకల్పానికి అనుగుణంగా ఈ ప్రజా ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

భావితరాల భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో యువత, తల్లిదండ్రులు, నగర ప్రజలు సహా సమాజంలోని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

డ్రగ్స్ నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా ముందుకు వచ్చినప్పుడే ఈ మహమ్మారిని అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *