కోటబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లా పరిషత్ నూతన చైర్‌పర్సన్‌గా కూటమి తరఫున జనసేన పార్టీ నుంచి నియమితులైన కొరికాన భవానీ శుక్రవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె వెంట భర్త, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ ఉన్నారు.

శనివారం జెడ్పీ చైర్‌పర్సన్‌గా భవానీ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ పరిధిలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ఆకాంక్షించారు.

ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సమర్థవంతమైన పాలన అందించాలని మంత్రి సూచించారు. తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని భవానీకి తెలిపారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *