ఎల్లారెడ్డిపేట, నవంబర్‌ 14, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

ఈ నెల 19 నుంచి 24 వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *