ఏపీలో ఒకే రోజు 2.50 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు.. అదే రోజు ఇళ్లు రాని వాళ్లకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కూడా వేస్తారు

Date:

ఏపీ ప్రభుత్వం పేదలకు తీపికబురు చెప్పింది.. ఒకేసారి ఏకంగా 2.50 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధమైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా 2.50 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గతంలో టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టి ఆగిపోయినవారికి.. ఆ డబ్బుల్ని తిరిగి చెల్లించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవాళ్ల సొంత ఇంటి కలను నిజం చేయబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి గృహ ప్రవేశాలకు సిద్ధమైంది. తొలి విడతగా 3 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందజేయగా.. తాజాగా మరో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. వాస్తవానికి ఉగాదికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించినా కుదరలేదు. ఈ మేరకు ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ 2.50 లక్షల గృహప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 2.50 లక్షల గృహాల్లో.. 1.42 లక్షలు కాలనీల్లో చేపట్టిన గృహాలు కాగా.. మిగిలిన 1.08 లక్షలు టిడ్కో ఇళ్లు ఉన్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించే కార్యక్రమంలో ఈ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు, లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడనున్నారు.

2017-19 అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.. లబ్ధిదారు వాటా డబ్బులు కూడా చెల్లించారు. గత ప్రభుత్వ హయాంలో వారందరికి టిడ్కో ఇళ్లు మంజూరు చేయలేదు. కొంతమందిని జాబితా నుంచి తొలగించి, ఇళ్లు కూడా రద్దు చేసిన పరిస్థితి. అయితే లబ్ధిదారు వాటా కింద చెల్లించిన రూ.172 కోట్లు కూడా తిరిగి చెల్లించలేదు. ఇలా మొత్తం 83వేలమంది ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యను గమనించిన కూటమి ప్రభుత్వం.. లబ్ధిదారుల వాటా కింద చెల్లించిన డబ్బుల్ని బాధితుల బ్యాంకు అకౌంట్‌లలో జమ చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డబ్బుల్ని కూడా గృహప్రవేశాల కార్యక్రమం రోజున.. అదే వేదికపై ముఖ్యమంత్రి చేతుల మీదుగా బ్యాంక్ అకౌంట్‌లలో ఈ జమ చేస్తారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...