ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో పట్టణాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల మునిసిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

ఈదురు గాలులకు రోడ్లపై చెట్లు కూలిన చోట వెంటనే తొలగించేలా అవసరమైన యంత్రాలు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్‌ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లు, డ్రెయిన్లలో నీరు నిల్వ ఉండకుండా ఇంజినీరింగ్ సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

వర్షాల కారణంగా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తాగునీరు కలుషితం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ఆర్నబ్ తుఫాన్ ప్రభావం సంభవించే నష్టాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తుఫాన్ కారణంగా జరిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని రెవెన్యూ యంత్రాంగానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ దిశానిర్దేశం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *