
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పోలింగ్ కేంద్రం ఆవరణలోకి నీరు చేరి బురదమయంగా మారింది. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన మహిళలు, ఇతర ఓటర్లు ఇబ్బందులు పడ్డారు.
వర్షపు నీటితో అధ్వానంగా మారిన ప్రాంగణం
జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడంతో బురద పేరుకుపోయింది. పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలంటే ఓటర్లు బురదలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
నీటిని తొలగించేందుకు సిబ్బంది చర్యలు
పోలింగ్ కేంద్రం ఆవరణలో నిలిచిన వర్షపు నీటిని బయటకు పంపించేందుకు పంచాయతీ సిబ్బంది శ్రమించారు. ఈ పనులను ఆర్వో శ్రీనివాస్ పర్యవేక్షించారు. అయితే మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల నిర్వహణకు ముందుగానే తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ఇలాంటి పరిస్థితులు ఎదురుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
