ఆంధ్రప్రదేశ్‌లోని 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మెజారిటీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండగా, ఇప్పటికే 25కు పైగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కూటమి కైవసం చేసుకున్నట్లు సమాచారం.

మిగిలిన ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ కూటమి అభ్యర్థులకు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తుది ఫలితాలు వెలువడితేనే మొత్తం స్థానాల్లో పార్టీల బలాబలాలపై స్పష్టత రానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు, అనంతరం వార్డుల వారీగా కౌంటింగ్‌ చేపట్టారు. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. మరోవైపు వైఎస్సార్‌సీపీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ముందంజలో ఉంది. నందికొట్కూరు మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంది. మొత్తం 32 వార్డులకు గానూ 22 స్థానాల్లో విజయం సాధించింది.

అదేవిధంగా బేతంచర్ల నగర పంచాయతీలోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 28 వార్డులకు గానూ 18 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మిగిలిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మాత్రం కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాయి. పూర్తి స్థాయి కౌంటింగ్‌ ముగిసిన తర్వాత తుది ఫలితాలపై స్పష్టత రానుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్‌ స్థానాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాల్లో కూటమి ఆధిక్యం కొనసాగుతోంది. మొత్తం 87 స్థానాల్లో ఇప్పటికే 17 చోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 70 ఛైర్‌పర్సన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

ఈ 70 స్థానాల్లో టీడీపీ తరఫున 49 మంది, జనసేన పార్టీ నుంచి 17 మంది, బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ కూడా మొత్తం 70 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో నిలిపింది.

ప్రస్తుతం వెలువడిన ఫలితాలు, ఆధిక్యాల వివరాలు ఇలా ఉన్నాయి:

పార్టీఆధిక్యంగెలుపు
టీడీపీ3026
జనసేన పార్టీ125
బీజేపీ21
వైఎస్సార్‌సీపీ40
ఇతరులు30

ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి పార్టీలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉండగా, జనసేన, బీజేపీ కూడా పలు చోట్ల విజయాలు సాధించాయి. మిగిలిన స్థానాలకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడాల్సి ఉంది.