
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన నైజీరియా పర్యాటకుల్లో ఒకరు అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన పర్యాటకులు కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ ఆరుగురు సముద్రంలో స్నానానికి దిగారు.
ఈ క్రమంలో ఫనెలె ఎన్కుబే అనే పర్యాటకుడు సముద్రంలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. దీంతో మిగతా పర్యాటకులు ఆందోళనతో కేకలు వేయడంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. స్పీడ్ బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి గల్లంతైన వ్యక్తిని గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు.
అనంతరం బాధితుడికి పోలీసులు సీపీఆర్ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో బీచ్ వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. సముద్రంలో స్నానాలకు దిగే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
