
D Educt: Nov 11: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు ప్రారంభం
నవంబర్ 25 వరకు గడువు.. ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు అవకాశం
పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపులు బుధవారం (నవంబర్ 11) నుంచి ప్రారంభమయ్యాయి. ఇటీవల ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 11 నుంచి 25వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
అనంతరం రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రాసే విద్యార్థులు రూ.110 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వృత్తివిద్యా కోర్సుల విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. అలాగే, నిర్ణీత వయోపరిమితి నిబంధనల నుంచి మినహాయింపు కోరే విద్యార్థులు వయోపరిమితి సడలింపు రుసుముగా రూ.300 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
