అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో దాడికి గురై తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.

బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తాజా వివరాలను వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో బాలిక నెమ్మదిగా అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రస్తుతం స్వయంగా శ్వాస తీసుకుంటోందని అయితే రాత్రి నిద్ర సమయంలో మాత్రమే స్వల్పంగా ఆక్సిజన్‌ సహాయం అవసరమవుతోందని పేర్కొన్నారు.

వైద్య సిబ్బంది సహకారంతో బాలిక నడక సాధన చేస్తోందని ఫిజియోథెరపీ కొనసాగుతోందని మంత్రి వివరించారు. ఇప్పటికే ముఖంపై ఉన్న కుట్లను తొలగించారని ఇతర గాయాలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు.

మరోవైపు బాలిక ఆహారం కూడా స్వయంగా తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. మెత్తటి ఆహారాన్ని నోటి ద్వారా తీసుకుంటోందని రక్తపోటుతోపాటు ఇతర ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నాయని బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుండటం ఆశాజనక పరిణామమని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పునరావాస ప్రక్రియ కొనసాగుతోంది.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *