రాష్ట్రంలో తుది, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్‌ జారీచేశారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌

 రాష్ట్రంలో తుది, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్‌ జారీచేశారు. 4273 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌, 42,794 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో విడతలో కోనసీమ, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో ఎన్నికలు జరగవు.

ఎన్నికలు జరిగే 25 జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 23 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన.. 25న నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లను స్వీకరిస్తారు. 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటుంది. 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరణ గడువు. వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.

డిసెంబరు 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఆ రోజే ఉపసర్పంచ్‌ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. ఏదైనా కారణంతో ఆ రోజు ఉపసర్పంచ్‌ ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. రీపోలింగ్‌ అవసరమైన సందర్భాల్లో డిసెంబరు 3 పోలింగ్‌ నిర్వహిస్తారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *