
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వై.ఎస్. శర్మిల ప్రభుత్వం తక్షణమే ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులకు బకాయిలుగా ఉన్న రూ.2,700 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆమె మాట్లాడుతూ — రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేద రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందుతున్నారు. కానీ, ప్రభుత్వం నెలల తరబడి ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో వైద్యసేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ రోగులను చేర్చుకోవడాన్ని నిరాకరిస్తున్నాయని శర్మిల పేర్కొన్నారు.
ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడకూడదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరించి, వెంటనే బకాయిలు చెల్లించి ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా నడిపించాలన్నారు. పేదలకు వైద్యసేవలు అందించే ఈ పథకం కుప్పకూలిపోకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు


