Rongalivanipalem Villagers Boycott MPTC and ZPTC Elections Over Reservation Change

అనకాపల్లి: అనకాపల్లి మండలంలోని రొంగలివానిపాలెం గ్రామస్థులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో 800కు పైగా ఓట్లు ఉన్నప్పటికీ, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటు వేసేందుకు ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రానికి రాలేదు.

గ్రామ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలుత బీసీలకు కేటాయించిన రిజర్వేషన్‌ను ఆ తర్వాత ఎస్సీలకు మార్చడంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎస్సీల జనాభా తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్ కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తూ నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో ఉదయం 9 గంటల వరకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు.

for more : Mptc Zptc election ubdates in dtv digital

గ్రామస్థులతో అధికారుల చర్చలు

ఎన్నికల బహిష్కరణ నేపథ్యంలో అధికారులు గ్రామస్థులతో చర్చలు ప్రారంభించారు. సమస్యలపై నిరసన తెలిపేందుకు ఎన్నికలను బహిష్కరించడం సరైన పద్ధతి కాదని ఎంపీడీవో సూచించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని గ్రామస్థులకు తెలిపారు. ప్రస్తుతం గ్రామస్థులు, అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.https://dtvandhrapradesh.com/