
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ పోలింగ్ కేంద్రంలోనే అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు.
కూడేరు మండల పరిధిలోని కడదరకుంట గ్రామ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన హరిత గౌడ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
దీంతో వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం కూడేరు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలో ఆమె కన్నుమూశారు.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఉపాధ్యాయురాలు మృతి చెందడంతో విషాదం నెలకొంది. హరిత గౌడ్ మృతితో సహచర సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
