తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు.. ఏడాదిలోగా అందుబాటులోకి, చురుగ్గా పనులు

Date:

వరంగల్ నగర ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలోనే మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది. ఎయిర్ కనెక్టివిటీ కోసం హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా నగరం నుంచే రాకపోకలు సాగించొచ్చు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు డీపీఆర్ సిద్ధం కాగా.. త్వరలోనే కేంద్రం ఆమోదముద్ర వేయనుంది. ఆ తర్వాత ఏడాదిలోగా ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తు్న్నారు.

తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఒక్కటే పౌరులకు సేవలందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించారు. వరంగల్ మామునూరు, రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కొత్తగా ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇందులో వరంగల్ మామునూరు విమానాశ్రయం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టు డీపీఆర్‌ సిద్ధంగా కాగా.. అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కొద్ది రోజుల్లోనే డీపీఆర్‌కు ఆమోదం లభించే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆపై ఏడాదిలో పనులు పూర్తి చేసి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చేందుకు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఇండిగో, ఎయిర్‌ ఇండియా వంటి పెద్ద పెద్ద విమానాలు ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేను మూడు కి.మీ.మేర పొడిగిస్తారు. ప్రయాణికుల టెర్మినల్, కార్గో సౌకర్యం, సెక్యూరిటీ వ్యవస్థలు, పార్కింగ్, అనుసంధాన మార్గాలు వంటివి ఎయిర్‌పోర్టులో నిర్మిస్తారు. ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం కేటాయించారు. ఈ భూమికి అదనంగా మరో 253 ఎకరాలు సేకరించి ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...