
బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరులో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఇది క్రమంగా బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిసెంబరు 4వ తేదీ తర్వాత శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశముందని పేర్కొన్నారు. ఇక డిసెంబరు రెండో వారంలో మరో తుఫాన్ ఏర్పడే సూచనలు ఉన్నప్పటికీ దాని తీవ్రత, దిశపై ఇప్పుడే అంచనాకు రాలేమని స్పష్టం చేశారు.
